Tuesday, August 18, 2026
HomeTelanganaఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

📰 Generate e-Paper Clip

ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమంను మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో సోమవారం నిర్వహించారు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమంను మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దార కుమారస్వామి, మాట్లాడుతూ. భారతదేశంలో ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని, ఈరోజు చాచా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే భారత దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం అని నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని నెహ్రూ అనేవారు. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారు. నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పండ్ల దాత టైలర్ సత్యనారాయణ సహాయంతో బాయ్స్ హై స్కూల్ మైదానంలో పిల్లలకు పండ్ల పంపిణీ చేశామని అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులకు, మరియు వాకింగ్ వచ్చినటువంటి తదితర ప్రజలకు కుడా పండ్లు పంచామని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ అధ్యక్షులు కొసరి రవీంద్రనాథ్, కోశాధికారి ముత్యం శ్రీనాథ్, ట్రెజరర్ లక్ష్మణ్, మరియు సభ్యులందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.