
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి బి. సత్తయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టులో నవంబర్ 12న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక కేసులతో పాటు బ్యాంకు, ఇన్స్యూరెన్స్ కేసులు కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు, సెషన్స్ జడ్జి మైత్రేయి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్, ఆడిషినల్ సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారంరెడ్డి, పోలీసు అధికారులు మంచిర్యాల ఎసిపి తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఎసిపి ఎడ్ల మహేష్, జైపూర్ ఎసిపి నరేందర్, పలువురు సిఐలు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
