Tuesday, August 18, 2026
HomeTelanganaఎమ్మెల్యే దత్తత గ్రామంలో అవినీతి పర్వం.?

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో అవినీతి పర్వం.?

📰 Generate e-Paper Clip

లక్షేటిపేట్ మండలం లోని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు దత్తత గ్రామం అయిన వెంకట్రావు పేట్  గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ నివేదికలో స్పష్టంగా అర్థమవుతుంది.

ఒక్క సంవత్సరం లోనే లక్షలు మాయం

ఎక్కడ చూసిన అవినీతే.. జిపి నిధులు ఎక్కడ?

సర్పంచ్ తనయులదే పెత్తనం

ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు.!

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షేటిపేట్ మండలం లోని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు దత్తత గ్రామం అయిన వెంకట్రావు పేట్  గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ నివేదికలో స్పష్టంగా అర్థమవుతుంది అని బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 2018సంవత్సరం నుండి ఇప్పటివరకు పలుమార్లు వివరణ అడిగిన  అధికారుల, నాయకుల అండదండలతో ఆడిట్ అధికారులనుసైతం బెదిరింపులకు గురించేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.  2018-19 సంవత్సరం నుండి ఇప్పటివరకు లక్షేటిపేట్ మండలం వెంకట్రావ్ పేట్ గ్రామపంచాయతీ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధంగా ఆ గ్రామపంచాయతీ లో సర్పంచ్, వారి తనయులు కలిసి వచ్చిన నిధులని మల్లించి, స్వంతానికి వాడుకున్నారని తెలుస్తుంది. వెంకట్రావ్ పేట్ గ్రామపంచాయతీ లో అసలు ఎలాంటి రికార్డులు, రసీదు లు మెంటైన్ చెయ్యలేదని, దీనికి సంబందించిన లెక్కలు చూపించాలని అధికారులు పలుమార్లు అడిగిన ఎవరు స్పందించకపోవడం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం లో సర్పంచ్, కార్యదర్శిల ప్రమేయం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ లోని డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటే చెత్తను పడేస్తున్నారు. హాస్పిటల్ కీ వచ్చిన వారికి ఇబ్బందిగా వున్నదని పలుమార్లు చెప్పిన పెదచేవిన పెడుతున్నారని ప్రజలు తెలిపారు. ప్రకృతి వనంలో మొక్కలకంటే ఎక్కువ గట్టి ఉంటుందని, పేరుకే ప్రకృతివనం, అంత అవినీతి పర్వమే అని ఆరోపిస్తున్నారు. మొక్కలు నాటే విషయంలో కూడా, వాటి సంరక్షణ లో కూడా లక్షల్లో అవినీతి జరిగిందని తెలిపారు. గ్రామపంచాయతీ లో విధులు నిర్వహించే సిబ్బందితో సర్పంచ్, వారి కొడుకులు స్వంత పనులు చేపించుకుంటున్నారని, గ్రామపంచాయతీ లో ఎలాంటి అభివృద్ధికి జరగలేదని,గ్రామపంచాయతీ లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. వెంకట్రావ్ పేట్ గ్రామపంచాయతీ లో పాతలెక్కలు రాపించేందుకు గ్రామపంచాయతీ లో పనిచేసిన కార్యదర్శిని పిలిపించి అర్ధరాత్రి వరకు లెక్కలు రాపించారని.. ప్రస్తుతం ఇతర జిల్లా లో పనిచేస్తున్న కార్యదర్శి ఆ సర్పంచ్, ఆ గ్రామపంచాయతీ లెక్కల కోసం జిల్లా దాటి వేంకట్రావ్ పేట్ గ్రామపంచాయతీ కీ రావడంలోనే  ఆ గ్రామపంచాయతీ లో అవినీతి ఏ తరహాలో జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది.

సర్పంచ్ కొడుకులదే పెత్తనం.
వెంకట్రావ్ పేట్ సర్పంచ్ తనయులు ఇద్దరు కలిసి గ్రామపంచాయతీ లో పెత్తనం చెలాయింస్తున్నారని, వారికి అడ్డు చెప్పిన, అడ్డు వచ్చిన  వారిని బెదిరింపులకీ గురించేస్తున్నారని, గ్రామపంచాయతీ సిబ్బందితో వారి స్వంత పనులు చేయించుకుంటున్నారని వినికిడి. ఒకరు గ్రామపంచాయతీ, పోలీస్ విషయాలు మరొక్కరు రెవెన్యూ, ఎంపిడిఓ కాయాలయాల వ్యవహారాలు చూసుకుంటున్నారని. వారిదే ఆ విషయాల్లో హవా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఏది ఏమైనా  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులను సంబంధిత ఖాతా లో జమచేసి గ్రామపంచాయతీ అభివృద్ధికి దోహదపడేల చర్యలు తీసుకుని,నిధులు దుర్వినియోగం చేసిన వ్యక్తులపై,నాయకులపై, అధికారులపై చర్యలు తీసుకొవాలని పలువురి అభిప్రాయం. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నలిమేల రాజు, యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ పోతారాజుల రామచందర్, మాజీ వార్డ్ సభ్యులు బత్తుల మురళి,మెరుగు లింగయ్య,పాయిల్ల చిన్నయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.