Monday, August 17, 2026
HomeTelanganaకొమురం భీం. గిరిజనుల గుండెల్లో సదా స్మరణీయుడు

కొమురం భీం. గిరిజనుల గుండెల్లో సదా స్మరణీయుడు

📰 Generate e-Paper Clip

దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ఆదివాసీల ఆరాధ్య దైవం, రైతాంగ సాయుధ పోరాట వీరుడు కొమురం భీమ్ గిరిజనుల గుండెల్లో సదాస్మరణీయుడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం కొమురం భీం 82 వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ లో కొమురం భీమ్ సమాధి వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎస్పి. సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ. నిజాం పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం వీరోచిత పోరాటం చేశారని, కొమరం భీమ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి కొమురం భీం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. అమరుడు కొమురం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్ ను అన్ని హంగులతో అభివృద్ధి చేయడం జరిగిందని, కొమరం భీం స్మారక చిహ్నం, స్మృతి వనం, 25 కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని, రోడ్డు, రెండు పడక గదుల పథకం, ఆశ్రమ పాఠశాలల  నిర్మాణం అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. జీ. ఓ. నెం. 3 ను న్యాయపరంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టులో కేసు వేసి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై కొమురం భీం విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా 55 కోట్ల రూపాయలతో ఆదివాసీ భవనాన్ని నిర్మించి, ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాల్లో 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం చేసిన పోరాటాలకు, సేవలకు గుర్తుగా ఈ జిల్లాకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా నామకరణం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలోని వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రెండవ దశలో మరికొన్ని చెక్ డ్యాముల నిర్మాణానికి త్వరలోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు ప్రజల సౌకర్యార్థం 5 కోట్ల రూపాయల వ్యయంతో 15 కిలోమీటర్ల మేర తారు రోడ్డును నిర్మించడం జరిగిందని తెలిపారు.గిరిజనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుతానికి పోడు భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయని, కోర్టు తదుపరి ఉత్తర్వుల ననుసరించి అర్హులైన గిరిజనులకు ఆర్ ఓ. ఎఫ్. ఆర్. పట్టాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దండారీ ఉత్సవాలకు కోటి రూపాయలు మంజూరు చేశామని, స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఆదివాసీల గూడాలలో నూతనంగా 100 దేవాలయాల నిర్మాణాలకు గాను ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతినిచ్చిందని తెలిపారు. గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి దినేష్ కుమార్, మాజీ ఎం.పి. నగేష్, ఐ. టి. డి. ఏ. చైర్మన్, పద్మశ్రీ కనకరాజు, కొమురం భీం మనుమడు సోనేరావు, మీ వర్ధంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు పెందూర్ మోహన్, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, కెనరా బ్యాంక్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.