
ఆంజనేయులు న్యూస్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం 82వ వర్ధంతి కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కెరమెరి మండలం జోడేన్ ఘాట్ గ్రామంలో ఆదివారం జరగబోయే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుండి ప్రజల అధిక సంఖ్యలో హాజరవుతారు కనుక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ తెలిపారు. రేపటి బందోబస్తులో అదనపు ఎస్పీలు 03 ( ఇందులో ఒకరు ఆదిలాబాద్ జిల్లా నుండి), డిఎస్పీలు 02, సీఐలు 12, ఎస్సైలు 27 మొత్తంగా 477 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు ఎస్పీ తెలిపారు.
