Wednesday, August 19, 2026
HomeTelanganaజంటనగరాల్లో భారీ వర్షం. స్తంభించిన జనజీవనం

జంటనగరాల్లో భారీ వర్షం. స్తంభించిన జనజీవనం

📰 Generate e-Paper Clip

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని చందానగర్, మల్కాజిగిరి, కీసర, పంజాగుట్ట, అంబర్పేట, కాచిగూడ,

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్:  జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని చందానగర్, మల్కాజిగిరి. కీసర, పంజాగుట్ట, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్లింగంపల్లి, బాలకుప్పూర్, కవాడిగూడ, జవహర్ నగర్, రాంనగర్, దోమలగూడ, కాటేదాన్, బోయినపల్లి, తిరుమలగిరి, మారేడుపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. బేగంపేట, ఆల్వాల్, చిలకలగూడ, గాంధీనగర్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, కిస్మత్పూర్, శంషాబాద్, మణికొండ, గండిపేట్, ఆరాంఘర్, బండ్లగూడ, నార్సింగిలో కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.