Tuesday, August 18, 2026
HomeTelanganaహామీలను నెరవేర్చాడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

హామీలను నెరవేర్చాడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

📰 Generate e-Paper Clip

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల అసెంబ్లీలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీ శనివారం దండేపల్లి మండలం గూడెం గ్రామ వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించి గూడెం, కన్నపల్లి గ్రామంలో మరియు లక్షట్టిపెట్ పట్టణంలోని అన్ని వార్డులను చింతల రామచంద్రారెడ్డి మరియు రఘునాథ్ ప్రతి గ్రామంలోనీ వార్డులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలు, ఉచిత రేషన్ బియ్యం, కరోనా టీకాలు మరియు వివిధ పథకాల పై ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.
కేసిఆర్ ప్రభుత్వం 8ఎండ్ల పాలన లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫలం అయింది అని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి వంటి అనేక హామీలు ఇచ్చి పేద ప్రలను మోసం చేశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి రబొయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి గద్దె దించుతారని అన్నారు. గ్రామాలకు వెళ్తున్న బిజెపి నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టి వారి సమస్యలు వివరిస్తున్నారని ప్రజల సమస్యల పరిష్కారానికి బిజెపి ప్రజల తరఫున పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మాట్లాడుతూ.
ఎమ్మెల్యే దివాకర్ రావు అసమర్థత వల్లనే లక్షట్టిపెట్ పట్టణానికి 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ మంజూరు కావడం లేదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే దివాకర్ రావు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే మంచిర్యాల మెడికల్ కళాశాలకు అనుమతి లభించలేదని అన్నారు. గూడెం లిఫ్ట్ ప్రాజెక్ట్ పైప్ లైన్లు మారుస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు పైప్ లైన్లు మర్చకపోవడం తో తరుచూ పైప్ లైన్లు పగిలి రైతుల పంటలకు నీరు అందక తీవ్ర నష్టం జరుగుతుంది అని అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు కి పేద ప్రజల పై చిత్తశుద్ది ఉంటే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, వీరమల్ల హారి గోపాల్, పోనుగోటి రంగ రావు, మున్న రాజా సిసోడియా, గుండా ప్రభాకర్, తమ్మినిడి శ్రీనివాస్, వేముల మధు, బందేల రవి గౌడ్, తోదేటి హరికృష్ణ, గడికొప్పుల చంద్రమౌళి, ఆకుల అశోక్ వర్ధన్, బోప్పు కిషన్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బండి రాజలింగు, పాంచాల రమేష్, నాగరాజు, చంద్రయ్య, రమేష్, సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.