Tuesday, August 18, 2026
HomeTelanganaసమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

📰 Generate e-Paper Clip

పెరిగిన వేతనాలు అమలు చేయాలి.

అన్ని రకాల వర్కర్లను పర్మినెంట్ చేయాలి.

వాల్ పోస్టర్ విడుదల చేసిన దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ ఆశ్రమ గిరిజన పాఠశాల – కళాశాల డైలీ వైజ్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం వర్కర్స్ సంఘం(సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో సెప్టెంబర్ 26 న జరిగే హైదరాబాద్ కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉంది. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన ఆశ్రమ పాఠశాల – కళాశాలల్లో పని చేస్తున్న అన్ని రకాల వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలి.కరోనా సమయంలో పని చేసిన వాటికీ వేతనాలు వెంటనే చెల్లించాలి. పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలి. పీఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. సమస్యల పరిష్కరానికై అధికారులు మరియు కార్మికుల ప్రతినిధులతో జాయింట్ సమావేశం నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు స్వాతి, భీమన్న, పూర్ణ, లక్ష్మి, ముత్తక్క, సత్తక్క, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.