Wednesday, August 19, 2026
HomeTelanganaభూదందాకు రూపకర్త కేసీఆరె: ఈటల తీవ్ర ఆరోపణలు

భూదందాకు రూపకర్త కేసీఆరె: ఈటల తీవ్ర ఆరోపణలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భూప్రక్షాళన పేరుతో ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. భూదందాకు రూపకర్త సృష్టికర్త సీఎం కేసీఆరేనన్నారు. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లు, భూమి క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని వేధించే హక్కు సీఎం కేసీఆర్ కు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. దేశంలో భూములన్నీ ఎన్ఎస్ఐసీలో భద్రంగా ఉన్నాయన్న ఈటల.. రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే నాలుగు సంస్థలు మార్చారని ఆరోపించారు. భూ సమస్యల వల్ల అనేకమంది రైతులు ప్రాణాలు తీసుకొంటున్నారని.. భూ సమస్యలతో న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.