Wednesday, August 19, 2026
HomeTelanganaఆదర్శ విద్యాలయంలో ఘనంగా హిందీ భాష దినోత్సవ వేడుకలు

ఆదర్శ విద్యాలయంలో ఘనంగా హిందీ భాష దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 ఘనంగా హిందీ భాష దినోత్సవ వేడుకలు

రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో ఘనంగా హిందీ భాషా దినోత్సవాలు నిర్వహించారు. బి వెంకటరెడ్డి అధ్యకత వహించి వివిధ భాషా దినోత్సవాలు, ఆటలు చిత్రలేఖనం ఉపన్యాస పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని అభినందిస్తూ ఈ కళా వేదిక ముందుకు సాగుతోందన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ భాష ఔన్నత్యాన్ని వివరించారు. ప్రపంచంలో నాలుగో పెద్ద భాషగా హిందీ ప్రాధాన్యత సంతరించుకుందని, సెప్టెంబర్‌ 14, 1949న మన రాజ్యాంగ సభ హిందీ భాషను రాజ్యభాషగా గుర్తించిందని, ఈ తేదీని జాతీయ హిందీ భాషా దినోత్సవంగా పాటిస్తారని తెలిపారు. ముఖ్యంగా మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి పొందుటకు, మన దైనందిన అవసరతలు తీర్చుకోవడా నికి హిందీ భాష అందరూ నేర్చుకోవాలని తెలిపారు. కాళిదాసు, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మైథిలీ శరణ్‌ గుప్తా, సరోజినీ నాయుడు, తులసి దాస్‌, కబీర్‌ వంటి ఎందరో కవులు హిందీ భాషను సుసంపన్నం చేసినారు అని తెలిపారు. హిందీ భాషా భోధనలో ఉపాధ్యాయులను పోగిడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, శ్రీశైలం ,శ్రీరాములు, భాగ్యరాజు ,శ్రీనివాసులు, నర్మదా ,స్వాతి, స్పందన, మణెమ్మ ఉపాధ్యాయుల తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.