
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్వతంత్ర్య భారత వజ్రోత్సవ మహోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోజువారి కార్యచరణ రూపొందించి అందించడం జరిగిందని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లాలోని ఎ.సి.సి. ప్రాంతం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెకర్ట్ మధుసూదన్ నాయక్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 75, 750, 7 వేల 500, 75 వేల మొక్కలను 75 సంఖ్య కనిపించేలా ఫ్రీడమ్ పార్క్ ను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 325 ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా 837 ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి 97 వేల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. నాటిన మొక్కలను పరిరక్షించడం, భారతదేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
