Monday, August 17, 2026
HomeTelanganaగుంతలో కూరుకుపోయిన బస్సు..?

గుంతలో కూరుకుపోయిన బస్సు..?

📰 Generate e-Paper Clip

 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా..? వాతావరణ ప్రభావమా..?

డ్రైవర్ అన్నలు జరభద్రం.?

కారణం ఏదైనా ప్రమాదంలో పాఠశాల బస్సు

వెంటనే స్పందించిన మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో నడిబొడ్డున భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రమాదాలు తప్పట్లేదు డ్రైవర్ అన్నలు జరభద్రం మా పిల్లలు మీ చేతిలో ఉన్నారు అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు..

వివరాల్లోకి వెళితే…: బస్సు గుంతలో కూరుకుపోయిందని స్థానికుల ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్ సిఐ నరేష్ తన సిబ్బంది తో కలిసి క్షణాల్లో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో ఎలాంటి భారీ యంత్రాల సహాయం లేకుండా ధైర్యంగా ముందడుగు వేసి చాకచక్యం గా వ్యవహరించి కాలువలో ఇరుక్కుపోయిన బస్సుని బయటకు తీశారు,  పలువురి మన్ననలు పొందారు. బస్సు ప్రమాదానికి గురి అయినప్పుడు ఈ రోజు ఆదివారం పాఠశాలలకు సెలవు దినం కాబట్టి అందులో విద్యార్థులు లేకపోవడం తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చింది. ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ధైర్యంగా ముందుకు వచ్చి వారి విధిని సక్రమంగా నిర్వహించినందుకు గాను సిఐ నరేష్ ను స్థానిక ప్రజలు, హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంట ఎస్సై విజయ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.