
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా పథకం అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న బీమా పథకం’ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా పథకం తీసుకొస్తున్నామని.. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 80వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని కేటీఆర్ చెప్పారు.
60ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికునికీ బీమా వర్తిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా పరిహారం అందుతుందని.. దీంతో భరోసా కలుగుతుందని కేటీఆర్ చెప్పారు.

