Thursday, July 2, 2026
HomeTelanganaఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..!

ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..!

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Post Midle

మంచిర్యాల జిల్లా: ఆగస్టు 1వ తేదీ నుండి నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహశిల్దార్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి నూతన ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపుల కొరకు భారత ఎన్నికల సంఘం నవరించిన ఫారాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సవరణల మేరకు ఫారం-6 నూతన ఓటరు నమోదు మాత్రమే వినియోగించడం జరుగుతుందని, ఓటరు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం కొరకు ఫారం 6బి, అభ్యంతరాల స్వీకరణ కొరకు ఫారం-7, నవరణలు, చిరునామాల మార్పు, సవరణలు లేకుండా నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం మార్పు కొరకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. సంబంధిత ఫారాలు బూత్ స్థాయి అధికారులు, మీ-సేవ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని, ఈ సంవత్సరం నుండి నూతన ఓటరు నమోదు అర్హత తేదీలు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 గా పరిగణించబడతాయని తెలిపారు.

ఫారం-6బి ధరఖాస్తు eci.gov.in, nvsp.in, voterpotral.eci.gov.in, ceotelangana.nic.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని, N.V.S.P., Voter Hilpline యాప్లను అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యు.ఐ.డి.ఐ.ఎ.తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ ఓ.టి.పి.ని ఉపయోగించి ఆధార్ ను ప్రామాణీకరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనల్ ఇట్యాల కిషన్, మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.