Tuesday, August 18, 2026
HomeTelanganaఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

ఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి

మంచిర్యాల జిల్లా: 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. ఈ సంవత్సరం విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో మందమర్రిలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా నుండి ఎం.పి.సి. ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులతో రాష్ట్రంలోనే 2వ ర్యాంకు సాధించిన ఎన్. జాహ్నవిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో మున్ముందు మరింతగా రాణించాలని తెలిపారు. అనంతరం ఎం. ఈ.సి. సంవత్సరంలో 486/500 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకులో నిలిచిన డి. రవళి, 10వ తరగతిలో 10/10 జి.పి.ఎ. సాధించిన 4 విద్యార్థులు జోషితశ్రీ, అక్షర, రాజలక్ష్మి, అభిలాషను అభినందించి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.జయకృష్ణరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.