Monday, August 17, 2026
HomeTelanganaఅండగా ఉంటాం.. అధైర్యపడొద్దు..?

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు..?

📰 Generate e-Paper Clip

లోతట్టు ప్రాంతాలను సందర్శించిన నడిపెల్లి విజిత్ రావు

75 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

మంచిర్యాల జిల్లా: బాధితులకి అండగా ఉంటామని ఏ విధంగానూ అధైర్యపడొద్దని టీఆర్ఎస్ యువనాయకుడు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు స్పష్టం చేశారు. ఆయన వరద నీటితో మునిగిన మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు, నస్పూరు మున్సిపాలిటీలో గురువారం పర్యటించారు. వరద నీరు వచ్చిన కుటుంబాలను పరామర్శించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వినూత్న కాలనీ లో వరద ప్రవాహం కారణంగా సుమారు 75 ఇండ్లు నీట మునిగిపోయాయి. బుధవారం రాత్రి నుండి వారిని కాపాడేందుకు బోట్లను ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు..ఈ కార్యక్రమంలో నడిపెల్లివిజిత్ తో పాటు నస్పూరు మున్సిపాలిటీ చైర్మన్ ఈసం పెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నస్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.