
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శ్రీ విశ్వనాథ ఆలయం నందు ఓం అష్టోత్తర యోగా పీట్ గురువు గుండా విజయ్ కుమార్ ఆర్యా ను, వేద వ్యాస మహర్షి జయంతి గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఓం అష్టోత్తర యోగా పీట్ ఆధ్వర్యంలో పూల బొకె అందజేసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు గురూ దేవో మాహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువేనమహా అని పేర్కొంటూ, తల్లి తండ్రులు జన్మ నిస్తే, పునర్జన్మనిచ్చి జీవితానికి సార్ధకతనిచ్చి, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించె గురువులందరికీ పాదాభివందనం,అని ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.యోగా గురువు మహర్షి పతంజలి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హోమ్ అష్టోత్తర యోగ పీట్ అధ్యక్షులు ముక్త వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కోడూరి శ్రీనివాస్, ఫిట్నెస్ సెంటర్ అధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, యోగ సభ్యులు అనిల్ శ్రీపతి, శ్రీశైలం, లావణ్య తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..
