Monday, August 17, 2026
HomeTelanganaఆత్మహత్యాయత్నాలకు టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం

ఆత్మహత్యాయత్నాలకు టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం జరుగుతున్న పేద ప్రజల ఆత్మహత్యా యత్నాలకు టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాలలోని రాజీవ్ నగర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఒక్క పేద కుటుంబానికి ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. రాజీవ్ నగర్ లో నిర్మాణం పూర్తయిన ఇండ్లను పేదలకు ఇవ్వకుండా జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.