Monday, August 17, 2026
HomeCrimeసాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణహత్య..?

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణహత్య..?

📰 Generate e-Paper Clip

గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి (25)ని హతమార్చారు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నంబర్ 1లో నారాయణ రెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో జూన్ 30న కేపీ హెచ్బీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.