Thursday, July 2, 2026
HomeTelanganaఅసాంఘిక శక్తుల కు ఆశ్రయం కల్పించవద్దు: ఎస్పీ సురేశ్ కుమార్ 

అసాంఘిక శక్తుల కు ఆశ్రయం కల్పించవద్దు: ఎస్పీ సురేశ్ కుమార్ 

📰 Generate e-Paper Clip

Post Midle

ఆసిఫాబాద్ జిల్లా: ” తిర్యాని మండలం, గుండాల గ్రామంలో శనివారం పోలిస్ లు మీకోసం”  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అథితి గా  జిల్లా ఎస్.పి కె.సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో భాగంగా  గ్రామస్తులకు నిత్యవసర సరుకులు, వృద్దులకు   వాకర్స్, పాఠశాల విద్యార్థులకు  నోట్ బుక్స్, ప్యాడ్స్,  గ్రామ యువతకు వాలీబాల్ కిట్లు   పంపిణి చేసారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెలకొందని , ప్రజలకు పోలిస్ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు .అసాంఘిక శక్తుల కు , కొత్త వ్యకులకు ఆశ్రయం కల్పించకూడదని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజల ధనమానప్రాణలను రక్షించటం లో పోలీసులు ముందుంటారని గ్రామ ప్రజలకు తెలియజేసారు. ప్రజలకు ఎపుడూ ఏ సమస్య ఉన్న డయల్ 100 క కాల్ చేసి తెలియజేయాలి అని, లేని పరిస్థితులలో  పోలిస్ స్టేషన్ లో సంప్రదించాలని అన్నారు. సహజ విస్తరాకుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. దీని ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందటం సంతోషకమన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి సాముహిక భోజనాలు చేశారు.

ఈ కార్యక్రమం లో  జిల్లా అదనపు ఎస్.పి  అచ్చేశ్వర్  రావు, డి.ఎస్.పి ఆర్.శ్రీనివాస్, సి.ఐ నరేందర్, ఎస్.ఐ  రమేష్ , ఆర్.ఎస్.ఐ ఓదెలు,  గ్రామ సర్పంచ్ జంగుబాయీ, ఎమ్.పి.టి.సి మెంగు బాయి  , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.