Friday, July 3, 2026
HomeTelanganaఅక్రమ కట్టడాలు కూల్చివేత..?

అక్రమ కట్టడాలు కూల్చివేత..?

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ మండలం బావురావుపేట, కిష్టంపేట గ్రామ శివారులో అసైన్డ్ మరియు ప్రభుత్వ భూములలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములలో కొన్ని నెలలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి సంబంధిత అధికారులు కూల్చి వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీగా పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తుండగా బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులకు, బాధితులకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందికొంతమంది రియల్ వ్యాపారులకు రెవెన్యూ అధికారుల అండ దండలతో రికార్డులు సృష్టిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా చెన్నూర్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో అసైన్డ్ భూములలో కొంతమంది రియల్టర్లు అక్రమంగా వెంచర్లు వేసి అధికారులకు లంచాలు ఆశచూపి నామమాత్రపు ఇంటి నెంబరు పొందుతున్నారని గతంలో ఒక కౌన్సిలర్ ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

ఏది ఏమైనప్పటికీ కొంతమందికి సంబంధించిన ఇంటి నిర్మాణాలను తొలగించారని మిగతావారు అధికార బలంతో అక్రమ ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.