Monday, August 17, 2026
HomePoliticalకాంగ్రెస్ లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

హైదరాబాద్: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 11 నెలల్లో ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. “హరితహారం పేరుతో దాడులు చేస్తున్నారు. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుంది. రైతు డిక్లరేషన్ అమలైతే.. రైతుల జీవితాలే మారిపోతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి…. పేదల ప్రభుత్వం రావాలి. త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. త్వరలో కాంగ్రెస్ లో చేరికల తుపాన్ రాబోతోంది” అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తే సరిపోతుందా? ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జా, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదు” అని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.