Tuesday, August 18, 2026
HomeTelanganaజాతీయస్థాయి నృత్యోత్సవ వేడుకల్లో జిల్లా కళాకారుల ప్రతిభ..!

జాతీయస్థాయి నృత్యోత్సవ వేడుకల్లో జిల్లా కళాకారుల ప్రతిభ..!

📰 Generate e-Paper Clip

నాట్య కళకే అలంకరణగా నిలుస్తున్న అన్నం కల్పన (M.A కూచిపూడి) శ్రీ నందిని నృత్యాలయం

మంచిర్యాల జిల్లా: ఆంద్రప్రదేశ్ చిత్తూరు లో శ్రీ వరసిద్దివినాయకస్వామి, కాణిపాకం దేవస్థానం ఆస్థానమండపంలో, సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరం మరియు ప్రైడ్ ఇండియ కల్చరల్స్, శ్రీకాళహస్తి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన” శ్రీకాణిపాక వినాయక  నృత్యోత్సవ్.“ నందు దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులచే, వివిధ భారతీయ సంప్రదాయనృత్యరీతులను ప్రదర్సించిరి… ఇందులో భాగంగా తెలంగాణ లో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ గురువు గారు శ్రీ నాట్యమయూరి అన్నం కల్పన (M.A కూచిపూడి) గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం లస్యప్రియ, అక్షయ, నవిత, సాన్వికళ, సాయిహసిని, హర్శిణి, ఆలొకీ, సాధిక, శ్రీవల్లీ, శ్రీసాన్వీ, రిషిత, యొగిత, నక్షత్ర, భువనకృత, సమన్విత, హంషీక, హంషీని, హర్శిణి, వసుధ, వీరు ఎంతో అద్భుతమైన నృత్య ప్రదర్శనలకు గాను  “శ్రీ గరుడ ఎక్స్ లెన్స్ అవార్డు” ను బహుకరించారు.. ఈ సందర్భంగా గురువు శ్రీ అన్నం కల్పన గారికి “డా॥ ఎపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు” ను బహూకరించి ఘనంగా సన్మానించారు..

ఈ కార్యక్రమం విజయవంతము చేయుటలో తమ పూర్తి సహాయసహకారాలను అందించిన, ముఖ్యఅతిధులుగ విచ్చేసిన.. గౌరవనీయులు.. శ్రీ డా।।వేదాంతం రాధేశ్యామ్ గారు, కూచిపూడి డ్యాన్స మాస్ట్రో…. శ్రీ డా।। కే.దేవేంద్ర పిళ్ళై హెచ్ఓడి, డిపాజిట్మెంట్ ఆఫ్ భరత నాట్యం కాలేజి ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, శ్రీ మోహన్ రెడ్డి గారు ట్రస్టు బోర్డ్ చైర్మన్ శ్రీవరసిద్దివినాయక దేవస్థానం, శ్రీ పి.కస్తూరి ఏఈఓ కాణిపాకం దేవస్థానం.. నాట్య గురువులు, నాట్య కళాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.