Friday, August 21, 2026
HomeAndhraశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.!

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.!

📰 Generate e-Paper Clip

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే కోరింది. మొత్తం 13.35 లక్షల టికెట్లకు గానూ ఉ.11గంటల వరకు 3.50 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.

సర్వదర్శనానికి 8 గంటల సమయం..

శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతున్నట్లు తితిదే వెల్లడించింది. నిన్న శ్రీవారిని 71,119 మంది దర్శించుకోగా.. 37,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.91కోట్లుగా నమోదైనట్లు తితిదే తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.