Tuesday, August 18, 2026
HomeWorldస్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు- పాక్ రేంజర్లు!

స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు- పాక్ రేంజర్లు!

📰 Generate e-Paper Clip

జమ్మూ: రంజాన్ పర్వదినం వేళ జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది పాక్ రేంజర్లు మిఠాయిలు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈద్ సందర్భంగా సరిహద్దు బలగాలు, పాక్ రేంజర్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నట్టు బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్ఎస్ సంధు వెల్లడించారు. సాంబా, కథువా, ఆర్ఎస్ పురా, అఖ్నోర్ తదితర సరిహద్దు అవుట్ పోస్టుల వద్ద మిఠాయిలు పంచుకున్నట్టు తెలిపారు. తొలుత బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి ఈద్ శుభాకాంక్షలు చెప్పగా.. ఆ తర్వాత వాళ్లూ మిఠాయిలు ఇచ్చారని వివరించారు..

దేశ సరిహద్దుల్లో శత్రు సేనల దాడులను నియంత్రించడంతో పాటు శాంతియుత, సుహృద్భావ వాతావరణం సృష్టించడంలోనూ బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇలాంటి చర్యలు ఇరు సైనిక బలగాల మధ్య శాంతియుత వాతావరణాన్ని, స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పేందుకు దోహదపడతాయని సంధు పేర్కొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.