Wednesday, August 19, 2026
HomeCrimeఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి పెద్దకాల్వల రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో వాహనం పెద్దపల్లి మండలం పెద్దకాల్వల రాజీవ్ రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎం వ్యానును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న చైత్రముఖి (25) అనే యువకుడితో పాటు పులా రామ్(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్కార్పియో వాహనంలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన ఇద్దరితో పాటు మిగతా ఐదుగురు మధ్యప్రదేశ్ కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.