Tuesday, August 18, 2026
HomeTelanganaసోషల్ మీడియాపై పటిష్టమైన నిఘా..!

సోషల్ మీడియాపై పటిష్టమైన నిఘా..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ జయంతి, శోభయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని మంచిర్యాల ఇంచార్జ్ డిసీపీ అఖిల్ మహాజన్ సూచించారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శోభాయాత్రలో డీజేకు ఎలాంటి అనుమతి ఉండదని, శోభయాత్రను అందరూ శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ఎలాంటి రూమర్లు నమ్మవద్దని, ప్రతి ఒక్కరు స్నేహభావంగా ఉండాలని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా స్పీచ్ లు, పాటలు పెట్టరాదన్నారు. సోషల్ మీడియాపై పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టరాదని ఆయన హెచ్చరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.