Monday, August 17, 2026
HomeTelanganaనా పేరు ఎందుకు బద్నాం చేస్తున్నారు: హేమ

నా పేరు ఎందుకు బద్నాం చేస్తున్నారు: హేమ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: బంజారాహిల్స్ లొనీ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆసమయంలో పబ్ లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంతోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానళ్లల్లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు. చేయడానికి ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు చేయడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. “డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు నా పేరుని ప్రసారం చేస్తున్నారు. నన్ను బద్నాం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చా” అని ఆమె అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.