Monday, August 17, 2026
HomeTelanganaమైనర్ ఇష్టపడి కలిసినా అత్యాచారమే..?

మైనర్ ఇష్టపడి కలిసినా అత్యాచారమే..?

📰 Generate e-Paper Clip

15 ఏళ్ల బాలిక కేసులో హైకోర్టు..!

అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి..

హైదరాబాద్: బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి ఓ బాలికకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. బాలిక(15)ను ఆమె బంధువు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి బలవంతంగా తన లైంగిక వాంఛను తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆసుపత్రిని ఆశ్రయించగా… అందుకు వైద్యులు నిరాకరించారు. చట్టప్రకారం అనుమతులు అవసరమని చెప్పడంతో.. బాలిక తరపున <span;>ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆమె ఇష్టపూర్వకంగానే తన బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా.. అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని.. శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉంటుందని పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవచ్చని తెలిపింది. అయితే దీనికి ముందు బాలికతో మాట్లాడాల్సి ఉందంది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమని… నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తమ అభిప్రాయం చెప్పాలంది. బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాడాలని ఆదేశించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నిలోఫర్ ఆసుపత్రి వైద్యులను హైకోర్టు ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.