Monday, August 17, 2026
HomeTelanganaసమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు..?

సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు..?

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులను సందర్శనకు అనుమతించడం లేదని సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. సమతామూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. తిరిగి ఏప్రిల్ 2వ తేదీ నుంచి యథాతథంగా భక్తులను సందర్శనకు అనుమతించనున్నట్లు పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకోవచ్చని వెల్లడించింది. సమతామూర్తి కేంద్రం ప్రవేశ రుసుంలో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలాగే ప్రతి బుధవారం కేంద్రానికి సెలవు ఉంటుందని పేర్కొంది. సెల్ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలకు సమతామూర్తి కేంద్రంలోకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.