Wednesday, November 4, 2026
HomeTelanganaఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల ప్రతినిధులకు అవకాశం.. కలెక్టర్ కుమార్ దీపక్ అభినందన!

ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల ప్రతినిధులకు అవకాశం.. కలెక్టర్ కుమార్ దీపక్ అభినందన!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, నవంబర్ 2, ( ఆంజనేయులు న్యూస్ )

గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అక్టోబర్ 31న నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన 13 మంది ప్రతినిధులు పాల్గొని జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ప్రతినిధుల బృందం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమానికి తెలంగాణ నుంచి 400 మంది హాజరుకాగా, మంచిర్యాల జిల్లా నుంచి ఐదుగురు పెద్దలు, ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి, జిల్లా నోడల్ అధికారి దేశ్‌పాండే శ్రీనివాసరావు నేతృత్వంలో పాల్గొన్న బృందంలో రైతులు, వ్యాపారవేత్తలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భావం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.