Monday, August 17, 2026
HomeTelanganaఅభివృద్ధి పనులపై ప్రచారం అవుతున్న అంశాలు అవాస్తవం

అభివృద్ధి పనులపై ప్రచారం అవుతున్న అంశాలు అవాస్తవం

📰 Generate e-Paper Clip

ఎవరికైనా అనుమానం ఉంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తాం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచాయి జన బాగీదారి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎంపికై అవార్డు పొందిందని, జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండలం పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జల్ సంచాయి జన బాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తేనే జాతీయస్థాయిలో గుర్తింపు లభించి జిల్లాకు అవార్డు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సి.ఎస్.ఆర్., డి ఎం ఎఫ్ టి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి పనుల పురోగతి ఫోటోలను సంబంధిత పోర్టల్ లో అప్ లోడ్ చేయడంతో పాటు పనుల జియో టాగింగ్ జరిగిందని తెలిపారు.

జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ బృందం రాండం విజిట్ చేసి పనులను నిర్ధారించిన తరువాత ఫోటోలు అప్ లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజలు వ్యక్తిగతంగా చేసుకున్న పనులకు సంబంధించి పబ్లిక్ పోర్టల్ లో ఫోటోలు అప్ లోడ్ చేయవచ్చని, అంతేకాకుండా క్యాచ్ ద రైన్ పథకంలో సైతం పథకానికి సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చని, ఈ క్రమంలో ఎవరైనా తప్పుగా పోర్టల్ లో ఫోటో అప్ లోడ్ చేయవచ్చని తెలిపారు. జల్ సంచాయి జన బాగీదారి కార్యక్రమంలో పనులు పూర్తి స్థాయిలో జరిగి ఎం.బి., మస్టర్ లను నిర్ధారించిన అనంతరం ఫోటోలు అప్ లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలకు, అవార్డుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అవాస్తవాలను నమ్మవద్దని, అవాస్తవ వార్తలను ఎవరు ప్రచారం చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.