Monday, August 17, 2026
HomeTelanganaడ్రైన్ (నాల) నిర్మించాలని ఎమ్మెల్యే, కమిషనర్ కు వినతి.

డ్రైన్ (నాల) నిర్మించాలని ఎమ్మెల్యే, కమిషనర్ కు వినతి.

📰 Generate e-Paper Clip

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి కమ్యూనిటి హల్ ముందు డ్రైన్ (నాల) నిర్మించాలని కోరుతూ ఆదివారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబుకు, ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ కు పద్మశాలి భవన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో వేరు వేరుగా వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా భవన కమిటీ సభ్యులు సిందం చంద్రయ్య మాట్లాడుతూ కమ్యూనిటి హల్ ముందు డ్రైన్ (నాల) లేక నీరు రోడ్డుపై నిలిచి,బురద ఏర్పడి, దుర్గంధం వేదజల్లుతుందని, అన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని నాల నిర్మాణానికి కృషి చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, కమిషనర్ కమ్యూనిటి హల్ ముందు డ్రైవ్(నాల) నిర్మించేందుకు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.అంతకంటే ముందుగా పద్మశాలి భవన కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ను శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాపెల్లి సదానందం, నల్ల కనకయ్య,గుల్లపేల్లి నాగేశ్వరరావు, గడదాసు మల్లయ్య,కొంపెళ్లి సుదర్శన్, కుసుమ చక్రపాణి, గడదాసు శంకరయ్య,అల్లి గురువయ్య, భోగ వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.