Monday, August 17, 2026
HomeCrimeశభాష్ మంచిర్యాల పోలీస్..!

శభాష్ మంచిర్యాల పోలీస్..!

📰 Generate e-Paper Clip

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన హరిదాస్ సాయికృష్ణ అనే యువకుడు గురువారం సాయంత్రం రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా డయల్ 100కు కాల్ రావడంతో బ్లూకోల్ట్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాజ్ కుమార్ సకాలంలో అక్కడికి చేరుకొని  కాపాడారు. అక్కడున్న స్థానిక ప్రజలు సుభాష్ మంచిర్యాల పోలీస్ అని అభినందనలు తెలియజేశారు. అనంతరం అతనిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, పట్టణ సిఐ బన్సిలాల్ అతని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి అతనిని ప్రభుత్వ ఆసుపత్రి నందు డీ-అడిక్షన్ సెంటర్ పంపించారు. సకాలంలో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్స్ ను సిఐ అభినందించి రివార్డ్ అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.