Tuesday, August 18, 2026
HomeTelanganaఅల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో జాతీయ శరణార్థుల దినోత్సవం.

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో జాతీయ శరణార్థుల దినోత్సవం.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: ప్రపంచంలో మానవాళికి అన్ని రకాలుగా సహాయపడాలని ప్రత్యేకంగా ఆహారం, వస్త్రాలను అందించడంలో ప్రధాన పాత్ర పోషించి ఖ్యాతి గడించడమే కాకుండా అత్యుత్తమ జీవనాన్ని కొనసాగించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో జాతీయ శరణార్థుల దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ. నేటి సమాజంలో శరణార్థులు నిర్లక్ష్యానికి గురైనారని, వారి పట్ల ఎవరికి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని. ఇలా వ్యవహరించడం చాలా విచారకరమని అన్నారు. ప్రతి ఒక్కరు శరణార్థులకు ఆపన్నహస్తం అందించి సేవలో ముందంజలో ఉండాలని కోరారు. నేడు ప్రతి ఒక్కరు తీరిక లేకుండా పలు కార్యకలాపాలలో పాల్గొనడంతో శరణార్థులకు ఎటువంటి వసతులు దొరకడం లేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శరణార్థులు ఉన్నారని వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి వారు సైతం శరణార్థులకు తగు గుర్తింపునివ్వడం ద్వారా వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తు ప్రతి ఒక్కరు శరణార్థులకు చేయూతనివ్వడంతో పాటు వారి అభివృద్ధికి పలు వనరులను అందించి సహాయపడాలని కోరారు. విద్యార్థులకు సమాజంలో పలు సమస్యలను ఎదురుకుంటున్న, నిర్లక్ష్యానికి గురైన శరణార్థుల గురించి తెలియజేయడానికై పలు కార్యక్రమాలని రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం వారు వారి శ్రేయస్సుకై పలు నిధులను కేటాయించారని, సలహాలను ఇస్తున్నారని తెలుపుతూ ప్రతి ఒక్కరు వారి అభివృద్ధికై చేయూతనివ్వడమే కాకుండా తగు సూచనలు చేయాలని కోరారు. నేడు ప్రపంచంలోని యువత వివిధ ఆసాంఘీక శక్తులకు భానిసలవుతు కనీసంగా మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మరియు ప్రజలు శరణార్థులు ఎదురుకుంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లి వారి శ్రేయస్సుకై మరియు సమస్యల పరిష్కారినికై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆదర్శంగా జీవనాన్ని కొనసాగించి ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.