Monday, August 17, 2026
HomeCrimeబెల్లంపల్లిలో నకిలీ ఉద్యోగాల దందా గుట్టు రట్టు.

బెల్లంపల్లిలో నకిలీ ఉద్యోగాల దందా గుట్టు రట్టు.

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగ నియామక ఉత్తర్వుతో నకిలీ ఉద్యోగాల ముఠా దందా వెలుగు చూసిన వైనం కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని సదరు ముఠా నకిలీ ఉద్యోగాల దందాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా బారిన పడిన ఓ యువతి ఉద్యోగం పేరిట డయాలసిస్ విభాగం ఇన్చార్జి సాయికుమార్ అప్రమత్తతతో ఉద్యోగాల నకిలీ ముఠా వ్యవహారానికి ఆదిలోనే గండి పడింది. బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) ద్వారా, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న అఫెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ‌తో బెల్లంపల్లిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే దుబాయ్ కేంద్రంగా ఓ నకిలీ ముఠా బెల్లంపల్లి డయాలసిస్ విభాగంలో ఉద్యోగాల కల్పనలో నకిలీ దందాలకు శ్రీకారం చుట్టింది. ఓ యువకుడు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డయాలసిస్ విభాగం ఇన్చార్జి సాయి కుమార్ కు నకిలీ ఉద్యోగ నియామక ఉత్తర్వును అందించాడు. లక్ష రూపాయలు తీసుకొని ఓ యువతికి జారీ అయిన ఈ ఉద్యోగ ఉత్తర్వుల పత్రాన్ని సాయికుమార్ పరిశీలించారు. తమ సంస్థ ద్వారా వాకబు చేయగా అది నకిలీ ఉద్యోగ ఉత్తర్వు గా తేలిపోయింది. నకిలీ ఉద్యోగి ఉత్తర్వులతో రెడ్ హ్యాండెడ్‌గా బయటపడిన సదరు యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతని నుంచి అంతకుముందే సేకరించిన ఫోన్ నెంబర్‌కు సాయికుమార్ ఫోన్ చేసి ఉత్తర్వు కోసం అడిగాడు. ఆ ఫోన్ నెంబర్ వ్యక్తి దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాని సమాధానం చెప్పాడు. అది నిజమైన నియామక ఉత్తర్వు అని నమ్మ పలికాడు. అంతేకాకుండా ఈ విషయంలో తాను బెల్లంపల్లి కి వస్తానని కూడా సాయి కుమార్ తో దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఇది నకిలీ వ్యవహారంగా నిర్ధారించుకున్న సాయి కుమార్ బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఉద్యోగాల నకిలీ ముఠా మూలాలు దుబాయ్ లో ఉన్నాయనే విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బెల్లంపల్లి పోలీసులు నకిలీ ఉద్యోగాల ముఠా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.