Wednesday, August 19, 2026
HomeTelanganaపదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది

📰 Generate e-Paper Clip

పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.

ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 08 మంది, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి  ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.