Tuesday, August 18, 2026
HomeTelanganaసింగరేణి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.

సింగరేణి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.

📰 Generate e-Paper Clip

జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణకే తలమానికమైన సింగరేణిలో ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ సందర్భంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ఐదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ప్రాంతంలో జరుగనున్న ఎన్నికల ఏర్పాట్లు, కౌంటర్ కేంద్రాన్ని డి.సి.పి. సుధీర్ రామనాథ్ కేకన్, చెన్నూర్ ఎ.సి.పి. మోహన్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జి.ఎం. సంజీవరెడ్డి, డి.జి.ఎం. అరవిందరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి డివిజన్లో 3 సింగరేణి ప్రాంతాలు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణ కొరకు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 5 రూట్ల విభజన చేయడం జరిగిందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు. చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.