Wednesday, August 19, 2026
HomeTelanganaకేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.