
ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక మత సంస్థ హంగు, హార్భాటంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ప్రార్థనల పేరుతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులను రప్పిస్తూ, గురువారం (నేడే) ప్రార్థన సమావేశాలు ఏర్పాటు చేసి బహిరంగ ప్రార్థనలు చేయడం ఎన్నికల నియమావళి కిందకు రాదా అని స్థానిక ప్రజలు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలే కరోనా బారి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు, అంటు వ్యాధులతో బాధపడుతున్న సమయంలో లక్షలాది మందిని ప్రోగు చేసి ప్రార్థన సమావేశాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తే పరిసర ప్రాంతాలన్నీ దుమ్ము, ధూళి, దుర్గంధంతో, పరిసర ప్రాంతాలన్నీ కలుషితమైపోతున్నాయని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతూ, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, లక్షలాది మందిని సమీకరించి ప్రార్థనల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రార్థన సమావేశాలకు రాజకీయ నాయకులను ఆహ్వానించి వారిని ఆశీర్వదించడం, గెలవాలని లక్షల మంది సమక్షంలో ప్రార్ధనలు చేసి ఆశీర్వదించడం, సబబేనా అంటూ ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు. చేయనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా లక్షలాది మందితో నేడు జరగబోయే బహిరంగ ప్రార్థనల సభను ఎన్నికల సంఘం ఏ కోణంలో చూస్తుందో, వేచి చూడాల్సిందే.
