Tuesday, August 18, 2026
HomeTelanganaమానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

శభాష్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి ఇబ్బందిని గమనించిన ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ ముసలవ్వను రోడ్డు దాటించి జాగ్రత్తగా గమ్యం చేరేందుకు సహాయం చేశాడు. ఈ ఘటన మంచిర్యాల పట్టణ ఐబి చౌరస్తాలో చోటుచేసుకుంది.

ఆంజనేయులు న్యూస్ వెబ్సైట్ ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా కూడలి దగ్గర వాహనాల రద్దీ ఎక్కువ ఉండడం వలన రోడ్డు దాటేందుకు ఓ ముసలవ్వ ఇబ్బంది పడుతుంది. ఇది గమనించిన అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ ముసలవ్వని రోడ్డు దాటించాడు. ఆమె ఎక్కడికి వెళ్లాలో అడిగాడు.. అందుకు ఆమె నా కూతురు ఇంటికి హాజీపూర్ కు వెళ్లాలని చెప్పింది. దీంతో ట్రాఫిక్ ఏఎస్ఐ ఆమెను హాజీపూర్ వెళ్లే ఆటో ఎక్కించి డబ్బులు ఇచ్చి మానవత్వం చాటుకున్నాడు.. అనంతరం ఆ వృద్ధురాలు ట్రాఫిక్ ఏఎస్ఐ కి రెండు చేతులు జోడించి దండం కొడకా సల్లగా ఉండాలి అని దీవించింది.. రోడ్డును దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పట్ల ట్రాఫిక్ ఏఎస్ఐ చూపిన ఔదార్యంపై వాహనదారులు స్థానికులు శభాష్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ అని ప్రశంసలు కురిపించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.