Wednesday, August 19, 2026
HomeTelanganaదళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో... అంబేద్కర్ కు ఘన నివాళులు

దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో… అంబేద్కర్ కు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన ఫోరం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు మాసు రాకేష్ అంబేత్కర్ జయంతి సందర్భంగా ద్విచక్ర వాహనాలతో బెల్లంపల్లి చౌరస్తా నుండి పట్టణంలోని ఐబీ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఫోరం సభ్యులు ఘనంగా నివాళులు అర్పించి ఫోరం అధ్యక్షులు మాస్ రాకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. భారతదేశానికి సర్వసత్తాక రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహా మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా మహోన్నతమైన రాజ్యాంగ రచన చేసి  ప్రపంచ మేధావుల్లో ఒకరిగా అంబేద్కర్ నిలిచిపోయారని తెలిపారు. సమసమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణా జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు చొక్కారపు శ్రీనివాస్, తెలంగాణా జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్వతి రాజేష్, పార్వతి సురేష్, డేగ ఆంజనేయులు, గౌతం, ఆర్కటి కేదారి, ప్రేమ్, రవి కిరణ్,అనిల్,రమేష్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.