Wednesday, August 19, 2026
HomeTelanganaద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఐబి చౌరస్తా వద్ద హెల్మెట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ వారితో కలిసి శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల విద్యార్థిని విద్యార్థులు “సెవ్ లైఫ్” అనే నినాదం తో టీ షర్ట్స్ మరియు హెల్మెట్ ధరించి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులకు పిల్లలతో గులాబీ పువ్వు ఇప్పించి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. నరేష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని తెలిపారు. ట్రాఫిక్‌ జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదన్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ధరించి కారు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.