Thursday, July 2, 2026
HomeTelanganaఆ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని లోటు

ఆ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని లోటు

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేరా

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో ఉత్తీర్ణులైన డిగ్రీ, పీజీ విద్యార్థులకు తీరని అన్యాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి

Post Midle

2014 సంవత్సరం తర్వాత ఉత్తీర్ణులైన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను ఆమోదించాలి.

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: దూరవిద్య విధానంలో విద్యను అభ్యసించుటలో కొన్ని గొప్ప యూనివర్సిటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  ఒకటి గా పేరుగాంచినది. అయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి ఉన్న గొప్ప పేరు తెలంగాణ రాష్ట్రంలో కరువైపోయింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంతోమంది విద్యను అభ్యసించి డిగ్రీ, పీజీ పట్టాలు పొందడం జరిగింది. అలా డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన వాళ్లు అధిక సంఖ్యలో గతంలో  ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనునది తెలుగు రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా అది మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దానిని పట్టించుకునే నాధుడే కరువైపోయారు. గతంలో నాగార్జున యూనివర్సిటీని నుండి ఉత్తీర్ణులైన డిగ్రీ పీజీ పట్టాలు పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరం తర్వాత డిగ్రీ, పీజీ పట్టాలను పొందిన అభ్యర్థులకు మాత్రం తీరని అన్యాయం చేస్తుంది. ఇదేమిటి అని విద్యార్థులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అడిగిన, ఉద్యమాలు చేసిన పట్టించుకోలేని దుస్థితి 2014 సంవత్సరం తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో కొన్ని లక్షల మంది డిగ్రీ, పీజీ పట్టాలు పొంది ఉన్నా కూడా అవి ఎందుకు పనికిరాని చిత్తు కాగితాల వలె పడి ఉన్నాయి అని విద్యార్థులు వాపోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనునది సంక్లిప్త వివరణ మాత్రం ఇప్పటివరకు లేదు. ఇదేమి పరిస్థితి అని విద్యార్థులు నోరు తెరిచి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి చూపిస్తూ ఇది ఒక జీవో ఉంది, ఆ జీవో ప్రకారం మేము చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన జీవో అనునది విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చడమే ముఖ్య ఉద్దేశమా? ఇది ఎక్కడి న్యాయం అని వారి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇట్టి విషయమై నిరుద్యోగ విద్యార్థులు ఏ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్లినా కూడా  పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రాల కలయికలో 10 సంవత్సరాల పాటు అనగా 2024 సంవత్సరం వరకు కూడా ప్రతి ఒక్క విభాగాల లావాదేవీలలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడి ఉంటాయి అని వాగ్దానం చేయడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారు అని నిరుద్యోగ విద్యార్థులు విచారణ వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఒక డిగ్రీ పట్టా పొందాలంటే మూడు సంవత్సరాల కాలవ్యవధి, అంతేకాక కళాశాల ఫీజులు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో ఎంతో కష్టపడి డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులకు ఇప్పుడు మీ సర్టిఫికెట్లు చెల్లవు అనడం ఎంతవరకు సబబు అని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియపరిచారు. డిగ్రీ పట్టాలను ఆమోదిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ప్రవేశపెట్టిన గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4, ఉద్యోగ నోటిఫికేషన్ లో మేమందరం కూడా అర్హత సాధించే వాళ్ళమని వాళ్ళ గోడు విన్నవించుకుంటున్నారు. అందువలన నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో 2014 తర్వాత ఉత్తీర్ణులై పట్టాలు పొందిన డిగ్రీ, పీజీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో ఒక బిల్ ప్రవేశపెట్టి తీర్మానించాలని నిరుద్యోగ విద్యార్థులు అందరూ కోరడం జరుగుతుంది.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.