Wednesday, August 19, 2026
HomeTelanganaమాజీ ఎమ్మెల్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

మాజీ ఎమ్మెల్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అధికార పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందడంతో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాలతో నియోజకవర్గం తిరోగమన దశలో పయనిస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో దివాకర్ రావును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి ప్రేమ్ సాగర్ రావు ను అసెంబ్లీకి పంపించడం తథ్యమని వారు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం సఫలీకృతం కావడంలేదని వారు విమర్శించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ రామగిరి బాణేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షులు సల్ల మహేష్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.