Tuesday, August 18, 2026
HomeTelanganaపోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం: డీసీపీ అడ్మిన్

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం: డీసీపీ అడ్మిన్

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన డిసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అవునూరి శ్రీనివాస్ Pc.2773 క్యాన్సర్ తో మరణించగా ఆయన భార్య స్వప్న, కుమారుడు కు భద్రత ఎక్స్ గ్రేసీయ రూ. 7,92,440 చెక్ ను శనివారం డిసీపీ అడ్మిన్ కార్యాలయం లో డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడ్మిన్ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ కార్యక్రమంలోఏ ఓ నాగమణి, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సూపరింటెండెంట్ నాగేశ్వర్ రావు, జూనియర్ అసిస్టెంట్ నజియా ఇరామ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.