
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, బిజెపి నాయకులు మరియు వార్డు ప్రజలు వాజపేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం రాజీవ్ నగర్ కు చెందిన 100 మంది యువకులు మరియు మహిళలు బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రఘునాథ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత మరియు మహిళలు బిజెపి పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే దమ్ము కేవలం బిజెపి పార్టీకే ఉంది అని అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీలో భారీ చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పచ్చ వెంకటేశ్వర్లు, కుదురుపాక గంగన్న, బీయ్యాల సతీష్, బల్ల రవి, రాజేందర్, స్వప్న రాణి మరియు తదితరులు పాల్గొన్నారు.

