Thursday, July 2, 2026
HomeCrimeసజీవ దహనం కేసులో.. మరో హత్య

సజీవ దహనం కేసులో.. మరో హత్య

📰 Generate e-Paper Clip

గుడిపల్లిలో జరిగిన సజీవదహనం కేసు మరో మలుపు తిరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గుడిపల్లిలో జరిగిన సజీవదహనం కేసు మరో మలుపు తిరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దహనం కోసం నిందితులు శ్రీరాంపూర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో 40 లీటర్ల పెట్రోల్ ను కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసు మరో మలుపు తిరిగినట్లు సమాచారం. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దీని ఆధారంగా ఈ కేసులో పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2020లో లక్సెట్టి పేటకు చెందిన రవికుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో కరోన వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందన్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఈ కేసు ఫైల్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సజీవ దహనం కేసులో ఆ హత్యతో సంబంధం ఉన్న అనుమానితులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్ లోనీ సీసీ ఫుటేజ్ ఆధారంగా లక్సెట్టి పేటకు చెందిన ఇద్దరు, గోదావరిఖనికి చేందిన ఇద్దరు ఒడిదెలకు చెందిన మరో వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ మర్డర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఒక్కరోజులో వేసిన స్కెచ్ కాదన్నారు. పక్కగా ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.