Wednesday, August 19, 2026
HomeTelanganaడియర్‌ ఇండిగో

డియర్‌ ఇండిగో

📰 Generate e-Paper Clip

 

స్థానిక భాషలను గౌరవించండి..

 అందరికీ హిందీ/ఇంగ్లిష్‌ రాదు.

స్థానిక భాషలు మాట్లాడేవారిని..విమానాల్లో నియమించుకోండి!

 మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌.?!

 విమానంలో తెలుగు మహిళ సీటు మార్పుపై తీవ్రంగా స్పందన.!

హైదరాబాద్‌:డియర్‌ ఇండిగో.. విమానాలెక్కే ప్రతి ఒక్కరికీ హిందీ,ఇంగ్లిష్‌ భాషలు రాకపోవచ్చు.అంత మాత్రాన వారిని చులకన చేయొద్దు.పౌరులు తాము హిందీ నేర్చుకోవాలా? వద్దా? అని నిర్ణయించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా.. ఆ భాషను బలవంతంగా రుద్దడంపై ప్రతిఘటన జరుగుతోంది.స్థానిక భాషలను గౌరవించడం ప్రారంభించండి.స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని విమానాల్లో నియమించుకోండి.ముఖ్యంగా తెలుగు,తమిళం, కన్నడ వచ్చే సిబ్బందిని నియమించండి అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్‌ శాఖల మంత్రి కేటీ రామారావు దిగ్గజ ఎకానమీ విమానయాన సంస్థ ఇండిగోకు సూచన చేశారు.ఈ నెల 16న ఇండిగో విమానంలో ఏపీలోని విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళ తెలుగు మాత్రమే మాట్లాడుతోందని, ఆమెకు హిందీ లేదా ఇంగ్లిష్‌ రాదనే కారణంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వద్ద నుంచి బలవంతంగా ఆమెను మరో సీటుకు మార్చారు.2ఏ (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వద్ద ఉండే విండో సీట్‌)లో కూర్చున్న ఆమె వల్ల భద్రతకు ముప్పు అని పేర్కొన్న ఎయిర్‌హోస్టెస్‌.. 3సీ(కిటికీ నుంచి మూడో సీటు) కేటాయించారు.దీనిపై ఆ పక్క సీటులోనే కూర్చున్న ఐఐఎం-అహ్మదాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవస్మిత చక్రవర్తి సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించారు.తెలుగు రాష్ట్రాల మధ్య విమానాలు నడుపుతూ.. తెలుగు రాని సిబ్బందిని నియమించి..తెలుగు మాట్లాడేవారిని వివక్షకు గురిచేయడమే ఈ చర్య అంటూ ఆమె సీరియ్‌సగా కామెంట్‌ పెట్టారు. బాధిత మహిళ ఫొటోను షేర్‌ చేశారు.ఈ ట్వీట్‌కు స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు. కొందరు నెటిజన్లు ఇండిగో సిబ్బంది చర్యను సెక్యూరిటీ పేరుతో సమర్థించగా.. చాలా మంది విమర్శించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.