Wednesday, August 19, 2026
HomeTelanganaప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలు

ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి నమస్యల పరిష్కారం దిశగా ఆయా నంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. చెన్నూర్ పట్టణంలోని జెండావాడ ప్రాంతానికి చెందిన పత్తి రజిత, కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన పత్తి శంకర్ తమకు కోటపల్లి మండలం పారుపల్లి శివారులో పట్టా భూమి కలదని, ఇట్టి భూమికి సంబధించి పట్టాదారు పుస్తకం కూడా ఉందని, ధరణి యందు ఇట్టి భూమి నిషేధిత జాబితాలో నమోదు చేయడం జరిగిందని, జాబితా నుండి తొలగించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు.

మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ కు చెందిన దేవరకొండ సంధ్యారాణి నిరుపేద రాలైన తనకు రెండు పడక గదుల పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన డెబ్బ కళ్యాణి వికలాంగురాలైన తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన సముద్రాల పోనవ్వ రేండ్లగూడ గ్రామ శివారులో 2 ఎకరాల ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉందని, ఇట్టి భూమిని అర్హులైన నిరుపేదలకు నివాసాల కొరకు కేటాయించగలరని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.